India corona : వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కేసులు

India corona : వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కేసులు
India corona : దేశంలో కోవిడ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు వారీ కేసులు మూడు లక్షలకు తగ్గడం లేదు.

India corona : దేశంలో కోవిడ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు వారీ కేసులు మూడు లక్షలకు తగ్గడం లేదు. వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3.33 లక్షల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. అయితే నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 525 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న రెండో దేశంలో భారత్‌ కొనసాగుతోంది.

దేశంలో డెయిలీ పాజిటివీటీ రేటు 17.22 నుంచి 17.78శాతానికి జంప్‌ కాగా, వీక్లీ పాజిటివీ రేటు 16.65గా నమోదైంది. కాగా నిన్న ఒక్కరోజే దాదాపు 61 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో మొత్తం వ్యాక్సినేషన్‌ 161.81 కోట్లకు చేరుకుంది. ఇందులో 80 లక్షల ప్రికాషన్‌ డోస్‌లు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

దేశంలో మహారాష్ట్ర నుంచే అత్యధిక కరోనా కేసులు వస్తున్నాయి. కొత్తగా 46 వేల 383 పాజిటివ్‌ కేసులు, 416 ఓమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. 48 మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ముంబైలో మాత్రం కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా 3568కు చేరాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు 28 శాతం, రెండు వారాల్లో 83 శాతం తగ్గాయి. కేరళలో కరోనా ఆందోళన పరుస్తోంది. అక్కడ 45వేలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story