Omicron Cases : పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. 17 రాష్ట్రాల్లో 358 కేసులు

Omicron Cases : దేశంలోని 17 రాష్ట్రాల్లో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని...వీరిలో 114 మంది రికవరీ అయ్యారని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇప్పటివరకూ దేశంలో అర్హులైన 89 శాతం మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్...61 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారని చెప్పారు. కరోనాను నియంత్రించేందుకు నైట్ కర్ఫ్యూ, భారీ సభలు, సమావేశాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించినట్లు గుర్తు చేశారు. 11 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కవరేజ్ జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నారు.
బూస్టర్ డోసు అందించే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు ICMR DG డాక్టర్ బలరాం భార్గవ. నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేందుకు సైంటిఫిక్ డేటాను రివ్యూ చేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్ పనితీరును పరీక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సూచనల నేపథ్యంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. డిసెంబర్ 25 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది యూపీ సర్కార్.
రాత్రి 11 గంట నుంచి 5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. వివాహ వేడుకలకు 200 మంది కంటే ఎక్కువ జనం హాజరు కావొద్దన్నారు. ఇప్పటికే మధ్య ప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒడిశా, మహారాష్ట్ర సర్కార్‌లు సైతం కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఒడిశాలో ఈ నెల 25 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రంలో ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com