సింగపూర్‌ నుంచి 4 క్రయోజనిక్‌ ట్యాంకులను తెప్పించిన కేంద్రం..!

సింగపూర్‌ నుంచి 4 క్రయోజనిక్‌ ట్యాంకులను తెప్పించిన కేంద్రం..!
ఇక అంతకుముందు ఆక్సిజన్ తరలింపు కోసం ఉపయోగించే 4 క్రయోజనిక్ ట్యాంకులను సింగపూర్ నుంచి తెప్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రాణవాయువు సరఫరా కోసం చర్యలు చేపట్టింది. ఆక్సిజన్ కొరత, పరికరాల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. వైద్య సామాగ్రిపై 3 నెలల పాటు కస్టమ్‌ సుంకం ఎత్తివేయాలని ఆదేశించారు. ఆరోగ్యసెస్ నుంచి మూడు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మొత్తం 16 ఆరోగ్య పరికరాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెడికల్ ఆక్సిజన్, రెగ్యులేటర్స్, కనెక్టర్స్, ట్యూబ్స్, వ్యాక్యూమ్ పరికరాలు, ఏఎస్‌యూలు, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ ట్యాంకులు, క్రయోజెనిక్ సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ, నిల్వ సామాగ్రిపై ఈ మినహాయింపులు ఉంటాయని కేంద్రం తెలిపింది.

ఇక అంతకుముందు ఆక్సిజన్ తరలింపు కోసం ఉపయోగించే 4 క్రయోజనిక్ ట్యాంకులను సింగపూర్ నుంచి తెప్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ సమీపంలోని హిండన్ వైమానిక స్థావరం నుంచి.. ఎయిర్‌ ఫోర్స్‌ కార్గో విమానం సింగపూర్‌‌లోని చంగి విమానాశ్రయానికి చేరుకుందని, అక్కడి నుంచి ట్యాంకర్లు తీసుకుని పశ్చిమ బెంగాల్‌లోని పానగఢ్ వైమానిక స్థావరానికి చేరుకుందని కేంద్రం తెలిపింది.

Tags

Next Story