2 మామిడి చెట్లకు నలుగురు మనుషులు, ఆరు కుక్కలు కాపలా..

వినడానికే వింతగా ఉంది. పది ఎకారల మామిడి తోట ఉన్నా అంతమందిని కాపలా ఉంచరు. వీళ్లేంటి ఇంత మందిని కాపలా పెట్టి పైగా శునకాల్ని కూడా ఉంచారు. ఆ చెట్టకు మామిడి కాయలు కాస్తున్నాయా లేక వజ్రాలు, వైఢూర్యాలు ఏమన్నా.. అవును మరి ఆ తోట యజమాని తన తోటలో రెండు జపాన్‌కి చెందిన మియాజాకి చెందిన మామిడి మొక్కలను పెంచుతున్నాడు. వాటి కాయలు చూడడానికి ఎర్రగా అందంగానూ, రుచిలో అమోఘంగానూ ఉంటాయట. ఇక వీటి ధర కూడా మామూలుగా లేదు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో.. రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులకు ఓ మామిడి తోట ఉంది. అందులో ఈ మొక్కలు ఉంచారు. అవి కూడా తాను ఓ సారి చెన్నై వెళ్తుండగా ఓ వ్యక్తి ఈ మామిడి మొక్కలను ఇచ్చారని తెలిపారు. ఆ మొక్కల గురించి తెలియకుండానే తన తోటలో నాటానని అన్నారు. ఇవి అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన మామిడి పళ్లని తెలిసింది. దాంతో వాటిని కొంత మంది దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని మొక్కలకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు సంకల్ప్. తోటలో ఉన్న రెండు మియాజాకి మామిడి చెట్లకు నలుగురు గార్డులను, ఆరు కుక్కలను కాపలాగా ఉంచారు. రైతు దంపతులు గత ఏడాది వీటిని కిలోకు రూ.2.70 లక్షలకు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించినట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com