నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా..

నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా..
అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు.

గుజరాత్‌లో నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 80 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేశామని గాంధీనగర్ మున్సిపల్ కమిషనర్ రత్నకన్వార్ గధావిచరణ్ తెలిపారు. కాగా, కొవిడ్ టెస్టులు చేయించుకున్న ఎమ్మెల్యేలలనే అసెంబ్లీకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Tags

Next Story