భీవండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య

X
మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గురువారం ఉదయానికి మొత్తం 41 మంది మరణించినట్టు తెలుస్తుంది.థానే జిల్లాలో భీవండిలో 43ఏళ్ల క్రితం నిర్మించిన మూడంతస్థుల భవనం ఎడతెరపిలేని వర్షాలకు సోమవారం తెల్లవారుజామన కూలిపోయింది. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ఇంకా ఓ చిన్నారి సహా మరో వ్యక్తి ఆచూకీ తెలియలేదు. భారీ వర్షాలకు సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సుమారు వంద మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
