పెళ్లి ఆశపెట్టి జంప్.. ఒకేరోజు అయిదుగురు అబ్బాయిలకి షాక్ ఇచ్చిన కిలాడీ..!

పెళ్లి ఆశపెట్టి జంప్.. ఒకేరోజు అయిదుగురు అబ్బాయిలకి షాక్ ఇచ్చిన కిలాడీ..!
ఓ యువకుడికి ఎన్ని సంబధాలు చూసిన పెళ్లి సెట్ అవ్వడం లేదు.. చివరికి ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక జరిగాయి..

ఓ యువకుడికి ఎన్ని సంబధాలు చూసిన పెళ్లి సెట్ అవ్వడం లేదు.. చివరికి ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక జరిగాయి.. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. బంధువులతో కలిసి కోలాహలంగా పంక్షన్ హాల్ కి చేరుకున్న వరుడికి పెద్ద షాక్ తగిలింది. అక్కడ వధువు కనిపించలేదు.. దీనితో వరుడి తల్లిదండ్రులు వెంటనే వధువు బంధువులకు కాల్ చేశారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్.. చివరికి వధువు నంబర్‌కు కాల్ చేస్తే అది కూడా స్విచ్ఛాప్ వచ్చింది.

దీనితో చేసేది ఏమీ లేకా పొలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్ళాక వరుడు కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వారికి.. అక్కడ మరో నలుగురు యువకులు అదే యువతి పైన ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ నలుగురు కూడా.. ఆ అమ్మాయి బాధితులేనని పోలీసులు చెప్పడంతో నోరెళ్లబెట్టడం ఆ వరుడి వంతయ్యింది. ఒక అమ్మాయి చేతిలో ఓకే రోజు ఐదుగురు మోసపోయారన్నమాట.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హార్దా జిల్లాలో చోటు చేసుకుంది.

ఇటీవల ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సీఎస్పీ భూపేంద్ర సింగ్‌ తెలిపారు. పెళ్లి సంబంధాలు తప్పిపోతున్న యువకులను గుర్తించి, వారిని ఇలా పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారని తెలిపారు. అబ్బాయిలు కాస్త వయసు ఎక్కువ వారైతే.. అమ్మాయి పేదింటి పిల్లని మాయమాటలు చెప్పి, పెళ్లికి ముందే అమ్మాయికి బంగారు గొలుసు కూడా పెట్టించుకున్నారట. ఇలా ఒక్కొక్కరి దగ్గర రూ. 20 వేలు తీసుకున్నారని, మొత్తం లక్ష వెనకేసుకొని పారిపోయారని భూపేంద్ర సింగ్‌ తెలిపారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story