ఒకే ఊరిలో ఐదుగురు చిన్నారులు గల్లంతు

ఒకే ఊరిలో ఐదుగురు చిన్నారులు గల్లంతు
గుజరాత్ జామ్‌నగర్ జిల్లా కల్‌మెగ్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు

గుజరాత్ జామ్‌నగర్ జిల్లా కల్‌మెగ్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఐదేళ్ల వయసున్న రాహుల్ ఠాకూర్, అతడి సోదరుడు కిరణ్, కజిన్ రియా గుంటలో పడి గల్లంతైయ్యారు. వీరు ముగ్గురూ ఆడుకున్న సమయంలో అక్కడే ఉన్న పశువుల మంద ఒక్కసారిగా వారి వైపు రావడంతో ఆందోళనతో పరిగెడుతూ లోతైన గుంటలో పడి గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అదే గ్రామంలో మరో ఘటనలో మరో ఇద్దరు వాగులో పడి గల్లంతయ్యారు. అల్పేష్ షతాజీ, అతని సోదరి పూనా.. విక్రమ్ అనేమరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా లోలెవల్‌ వంతెనపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో బైక్ పడిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రవాహంలో గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.

Tags

Next Story