Home
 / 
జాతీయం / ఒకే కుటుంబంలో విషం...

ఒకే కుటుంబంలో విషం తాగి ఐదుగురు ఆత్మహత్య

గుజరాత్‌లోని ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఒకే కుటుంబంలో విషం తాగి ఐదుగురు ఆత్మహత్య
X

గుజరాత్‌లోని ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాహోద్ జిల్లాలో శుక్రవారం రాత్రి సైఫీ సబ్బర్‌భాయ్ అతని భార్య, ముగ్గరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, శుక్రవారం అర్థరాత్రి విషం తాగి కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతన్నారు. అయితే, సూసైడ్ నోట్ లో ఆత్మహత్యకు గల కారణాలు ఏవీ లేవని తెలిపారు. కానీ, ప్రాథమిక విచారణలో ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. మృతుల బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా పరీశీలిస్తున్న పోలీసుల.. పలు కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story