Nasik Road Accident: అతివేగం.. అయిదుగురు విద్యార్ధులు మృతి

Nasik Road Accident: అతివేగం.. అయిదుగురు విద్యార్ధులు మృతి
X
Nasik Road Accident: మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Varanasi Road Accident: మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిన్నార్ సమీపంలోని మోహదారి ఘాట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు మరో రెండు కార్లను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.



మొత్తం 8 మంది విద్యార్ధులు నాసిక్‌ నుంచి సిన్నార్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐతే వీరి కారు అతివేగం కారణంగా లేన్ క్రాస్‌ చేసి ఎదురుగా వస్తున్న కార్లను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ముగ్గురు విద్యార్థులకు, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Tags

Next Story