విషాదం.. అయిదేళ్ల బాలుడు లిప్ట్‌లో ఇరుక్కుని..

విషాదం.. అయిదేళ్ల బాలుడు లిప్ట్‌లో ఇరుక్కుని..
శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింద ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిప్ట్ ఎక్కాడు.

అపార్ట్‌మెంట్‌లో లిప్ట్ అయిదేళ్ల చిన్నారిని బలి తీసుకుంది.. ముంబై ధారావికి చెందిన మహ్మద్ హోజైఫ్ షేక్ అనే ఐదేళ్ల చిన్నారి లిప్ట్ డోరులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్‌మెంట్‌లో శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింద ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిప్ట్ ఎక్కాడు. ఆ లిప్ట్‌కు గ్రిల్స్‌తో పాటు డోర్ కూడా ఉంది. అయితే లిప్ట్ కింది ఫ్లోర్‌లోకి రాగానే డోర్ తెరుచుకోవడంతో పిల్లలంతరూ బయటకు వచ్చారు. అందరిలోకి చిన్నవాడైన షేక్ బయటకి వచ్చి లిప్ట్ గ్రిల్స్ వేస్తుండగా వెను ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య షేక్ నలిగిపోయాడు.. ఎలా బయటకు రావాలో తెలియలేదు ఆ చిన్నారికి. ఈలోగా మరొకరు లిప్ట్ బటన్ నొక్కేయడంతో కిందకు వెళ్లింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉన్న బాలుడు లిప్ట్ గ్రిల్స్‌లో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

Tags

Next Story