30 Aug 2020 10:22 AM GMT

Home
 / 
జాతీయం / సెంట్రల్‌ జైలులో 50...

సెంట్రల్‌ జైలులో 50 మందికి కరోనా పాజిటివ్

సెంట్రల్‌ జైలులో 50 మందికి కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సామన్యులతో పాటు పోలీసులను, ఖైదీలను ఎవ్వరినీ ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా సెంట్రల్ జైలులో 50 మందికి కరోనా సోకింది. జార్ఖండ్‌లోని దుమ్కా సెంట్రల్ జైలులో ఆదివారం 900 మందికి పైగా ఖైదీలు, సిబ్బంది నమూనాలను సేకరించి పరీక్షించారు. దీంతో 50 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

వైరస్‌ బారిన పడిన దోషులను, అండర్ ట్రయల్స్ ఖైదీలను జైలులోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు దుమ్కా సెంట్రల్ జైలులోని జైలర్ పేర్కొన్నారు. జైలులో 1,213 మంది పురుషులు, 74 మంది మహిళలు సహా మొత్తం 1,287 మంది ఖైదీలు ఉన్నారని ఆయన వెల్లడించారు.

  • By Admin
  • 30 Aug 2020 10:22 AM GMT
Next Story