జాతీయం

రూ.50లక్షల ఖర్చు.. కోవిడ్ నుంచి కోలుకున్నా దక్కని ప్రాణం..

కరోనా ఆమె కలల్ని కాల రాసింది. కళ్యాణం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.

రూ.50లక్షల ఖర్చు.. కోవిడ్ నుంచి కోలుకున్నా దక్కని ప్రాణం..
X

కరోనా ఆమె కలల్ని కాల రాసింది. కళ్యాణం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. 40 రోజులు మృత్యవుతో పోరాడి చివరకు అలసి పోయి కన్నుమూసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మ రెడ్డి (28). హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకుందామని స్వదేశాని వచ్చిన ఆమెకు వైరస్ సోకింది.

చికిత్స తీసుకుని కోవిడ్‌ నుంచి కోలుకుంది. మే నెలాఖరులో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు కుటుంబసభ్యులు. కానీ నరిష్మకు కోవిడ్ ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా పడింది. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. 40 రోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. చికిత్స కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేశామని అయినా ప్రాణం దక్కలేదని నరిష్మ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES