Karnataka: 50 ఏళ్లు పైబడినా.. 28 ఏళ్లుగా ఆటో నడుపుతూ..

Karnataka: మహిళలు కేవలం ఇళ్లు చక్కబెట్టడమే కాదు. అవసరమైతే ఇళ్లు దాటి బయటికి వెళ్లి సంపాదించి ఇంటి భారాన్ని మోయగలరు కూడా. ఈ విషయాన్ని నిరూపించడానికి మన చుట్టు పక్కలే ఎంతోమంది మహిళలు కనిపిస్తుంటారు. ఆర్థికంగా ఇంటికి నెట్టుకురావాల్సిన సమయం వచ్చినప్పుడు చిన్న పనా, పెద్ద పనా అని చూడకూడదు. ఈ విషయంలో మహిళలు ముందుంటారు. అలా గత 28 ఏళ్లుగా ఆటో నడుపుతూ తన ఇంటిని నిలబెట్టుకుంటున్న ఒక మహిళ కథ ఇది.
కర్ణాటకలోని అమరేశ్వర్ కాలనీకి చెందిన నిర్మలకు 50 ఏళ్లు పైనే ఉండొచ్చు. ఆమె గత 28 సంవత్సరాలుగా రాయచూర్ బస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతున్నారు. భర్త తాగుడికి బానిసవ్వడంతో ఇంటితో పాటు పిల్లల చదువుల భారం కూడా పూర్తిగా తనపైనే పడింది. అందుకే ఆటో నడపడం నేర్చుకుని 28 ఏళ్లయిన ఇంకా అదే పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రత్నప్రభ మహిళ సాధికారత కోసం పాటుపడిన విషయం తెలిసిందే. అయితే 1992లో ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో కొందరరు మహిళలకు ఆమె ఆటో నడపడంలో శిక్షణ ఇప్పించారు. అలా ఆటో నడపడం నేర్చుకున్న వారిలో నిర్మల ఒకరు. శిక్షణ పూర్తయ్యాక 11 మందికి ప్రభుత్వం సబ్సిడీ మీద ఆటోలు అందించింది.
నిర్మల కూడా అలాగే ఆటోను సంపాదించుకుంది. ఈ 26 ఏళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు పడినా ఆటో నడపడం మాత్రం ఎప్పుడు మానలేదు. ఆటో నడుపుతూ వచ్చిన సంపాదనతోనే ఆమె రాయచూర్‌లో ఓ స్థలాన్ని కూడా కొనుకున్నారు. ఇలా ఏదో ఒక పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న నిర్మలలు మనం సమాజంలో ఎందరో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com