యూపీలో విషాదం.. దూడను కాపాడే ప్రయత్నంలో ఐదుగురు మృతి

X
By - shanmukha |9 Sept 2020 7:48 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఈ పాడుబడిన బావిలో పడిన ఆవుదూడను రక్షించే ప్రయత్నంలో
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఈ పాడుబడిన బావిలో పడిన ఆవుదూడను రక్షించే ప్రయత్నంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బావిలోని విషవాయువు పీల్చడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ బావిలో స్థానికులు చెత్త వేసేవారు. అయితే, మంగళవారం ఓ దూడ ఆ బావిలో పడిపోయింది. దీంతో ఆ దూడను రక్షించేందుకు ఓ వ్యక్తి నిచ్చెన సహాయంతో దిగాడు. అందులో విషవాయువు పీల్చడంతో అతను మూర్చపోయాడు. ఆయనను రక్షించేందుకు మరో నలుగురు దిగి మూర్చపోయారు. అగ్నిమాపకదళం, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొన వారిని బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ ఐదుగురు మరణించారని వైద్యులు తెలిపారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com