6 నెలల్లో టోల్ ప్లాజాలు ఉండవు..అంతా జీపీఎస్ సిస్టమే

జాతీయరహదారులపై టోల్ చార్జీలను వసూలు చేయడానికి టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయినప్పటికీ కార్యాలయాల వేళ్లలో సిటీల దగ్గరలోనీ టోల్ ప్లాజాల వద్ద వేచి చూడాల్సిన సందర్భాలు ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018-2019లో ఫాస్ట్ ట్యాగ్ అందుబాటులో లేనప్పుడు ఒక్కో వాహనదారుడికి దాదాపు ఎనిమిది నిమిషాల సమయం పట్టేది. అయితే 2020-21లో ఫాస్ట్ ట్యాగ్ అందుబాటులోకి రావడంతో ఎనిమిది నిమిషాల సమయం కాస్త 47 సెకన్లకు తగ్గింది. అయినప్పటికి కొన్ని కొన్ని రద్దీ ప్రాంతాల్లో, నగరాల్లో కార్యాలయాల వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సంఘటనల నుంచి బయట పడటానికి కేంద్రం కొత్త టెక్నాలజీలను వినియోగించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ నేపథ్యంలో జీపీఎస్ బేస్ టోల్ కలక్షన్ సిస్టాన్ని రానున్న ఆరు నెలల్లో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గట్కరి శుక్రవారం వెల్లడించారు. జీపీఎస్ సిస్టం రావడం మూలంగా టోల్ ప్లాజాలతో అవసరం ఉండదని సమయం వృదా అవ్వకపోవడంతో పాటు ఎంతదూరం ప్రయానిస్తున్నామో దానికి మాత్రమే చెల్లించ వచ్చునని ఆయన తెలిపారు. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెవిన్యూ ప్రస్థుతం 40 వేల కోట్లు ఉందని రాబోయే రెండు మూడు సంవత్సారాల్లో 1.40 లక్షల కోట్లకు పెరగనుందని నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com