ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఎన్ని లాభాలో..

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఎన్ని లాభాలో..
ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలతో సహా వివిధ ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలతో సహా వివిధ ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఇంకా బరువు తగ్గడానికి సహాయపడటం, కొలెస్ట్రాల్ తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం మరియు డయాబెటిస్ లక్షణాలను మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క 6 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. ఇందులో ప్రోటీన్లు, ఎంజైములు, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉండడంతో పాటు తక్కువ మొత్తంలో పొటాషియంను అందిస్తుంది. మంచి నాణ్యత గల బ్రాండ్లలో కొన్ని అమైనో ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్స్‌ను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు.

2. హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. వెనిగర్ బ్యాక్టీరియాతో సహా వ్యాధికారక కారకాలను చంపడానికి సహాయపడుతుంది. హిప్పోక్రేట్స్ 2,000 సంవత్సరాల క్రితం గాయాలను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించారు.

వెనిగర్ ఈకోలి వంటి బ్యాక్టీరియా ఆహారాన్ని పాడుచేయకుండా నిరోధిస్తుంది. ఆహారాన్ని కాపాడుకోవడానికి సహజమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఆపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. వెనిగర్ లోని ప్రధాన పదార్ధం - ఎసిటిక్ ఆమ్లం - ఇది హానికరమైన బ్యాక్టీరియాను చంపగలదు.

3. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు నిద్రించే ముందు 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడంవల్ల మరుసటి రోజు ఉదయం రక్తంలో చక్కెర 4% తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. అనేక ఇతర అధ్యయనాలు వెనిగర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని చూపిస్తుంది. నేషనల్ సెంటర్స్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ (ఎన్‌సిసిఐహెచ్) నివేదిక ప్రకారం.. చక్కెరను తగ్గించే ఔషధాలను తీసుకుంటూ వాటికి ప్రత్యామ్నాయంగా వెనిగర్ తీసుకునేటట్లయితే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం ముఖ్యం.

4. బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. ఊబకాయం ఉన్న 175 మందిపై జరిపిన ఒక అధ్యయనంలో రోజువారీ ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగం బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గడానికి దారితీసిందని తేలింది. ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెరను తగ్గించడం, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ టేబుల్ స్పూన్కు మూడు కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది.

5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు మరణానికి దారి తీసే ప్రధాన కారణాలలో ఒకటి. వెనిగర్ ఈ ప్రమాద కారకాలను మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. జంతువులపై పరిశోధనలు జరిపిన అనేక అధ్యయనాలు ఆపిల్ సైడర్ వెనిగర్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను, అలాగే అనేక ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. ఎలుకలలో జరిపిన కొన్ని అధ్యయనాలు వెనిగర్ రక్తపోటును తగ్గిస్తుందని చూపించాయి.

6. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడి చర్మం కలవారు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల చర్మం యొక్క సహజ పిహెచ్‌ను తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నఆపిల్ సైడర్ వెనిగర్, తామర మరియు ఇతర చర్మ పరిస్థితులతో ముడిపడి ఉన్న చర్మ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఫేస్ వాష్‌కు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వినియోగించడం ద్వారా బ్యాక్టీరియాను చంపి మచ్చలను నివారించగలదు. ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ సలాడ్ డ్రెస్సింగ్‌లలో వినియోగిస్తారు. కొంతమంది దీనిని నీటిలో కరిగించి పానీయంగా తాగడానికి కూడా ఇష్టపడతారు. సాధారణ మోతాదులు రోజుకు 1-2 టీస్పూన్లు (5–10 ఎంఎల్) నుండి 1-2 టేబుల్ స్పూన్ (15–30 ఎంఎల్) వరకు ఒక పెద్ద గ్లాసు నీటిలో కలుపుకుని తాగుతారు. ఎక్కువ వెనిగర్ హానికరమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పంటి ఎనామిల్‌ని దెబ్బతీస్తుంది.

వాడే ముందు ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం.

Tags

Next Story