Personal finance checklist: మార్చి 31లోపు చేయవలసిన 6 ముఖ్యమైన పనులు..

Financial Planning: ఆర్థిక ప్రణాళిక ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ఆ మేరకు ఖర్చులు, ఆదాలు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి ప్రణాళిక వేయడం చాలా ముఖ్యం. అయితే, మీరు ఏడాది పొడవునా ప్లాన్ చేయకపోతే కీలకమైన ఆర్థిక పనులను నిర్వహించడానికి చివరి నిమిషం వరకు వేచి ఉంటే కనీసం ఈ మార్చి 31లోపైనా ఆ పనులు పూర్తి చేయండి. అందుకోసం మీరు చేయవలసిన పనుల జాబితా ఇక్కడ ఉంది.
పన్ను ఆదా కోసం పెట్టుబడి
సంవత్సరానికి మీ ఆదాయం ఎంత.. పన్ను ఎంత కట్టాలి అన్న విషయాలన్ని నిపుణులతో చర్చించండి. సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి అని తెలుసుకోండి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో మీరు ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కట్టవలసిన మొత్తాన్ని కట్టేయండి.
ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్
AY 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 15 వరకు పొడిగించబడింది. పెనాల్టీలను నివారించేందుకు మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి.
ఆధార్-పాన్ లింక్
PANతో ఆధార్‌ను లింక్ చేయడానికి గడువు మార్చి 31 వరకు పొడిగించబడింది. ఒకవేళ అలా చేయకుంటే, మీ PAN కార్డ్ పనిచేయదు. దాంతో మీరు PAN ఆధారిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేకపోవచ్చు.
ముందస్తు పన్ను దాఖలు
భారతదేశ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను కలిగిన వ్యక్తి మార్చి 15లోపు నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు ముందస్తు పన్ను చెల్లించడం తప్పనిసరి. గడువులోగా పన్ను చెల్లించకపోతే నెలకు 1 శాతం పెనాల్టీ విధించబడుతుంది.
బ్యాంక్‌తో KYCని అప్‌డేట్
బ్యాంక్ ఖాతాలలో KYCని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు పొడిగించబడింది. ఖాతాదారుడు తప్పనిసరిగా PAN, వ్యక్తిగత చిరునామాతో సహా బ్యాంక్ కోరుకునే ఇతర సమాచారాన్ని సమర్పించాలి.
పెండింగ్‌లో ఉన్న పన్ను
వివాద్ సే విశ్వాస్ పథకం కింద, పన్ను పెండింగ్‌లో ఉన్న వారందరూ మార్చి 31, 2022లోపు చెల్లించినట్లయితే వడ్డీ లేదా పెనాల్టీలను పూర్తిగా మాఫీ చేయవచ్చు. ఏవైనా వివాదాలను పరిష్కరించి, వాటిని చెల్లించడం మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com