Demat Account: అకౌంట్లోకి 6వేల కోట్లు.. ఎలా వచ్చాయో తెలియదు..

Demat Account: అతడేమీ అంబానీ కాదు, అదానీ కాదు.. వేల కొట్ల బిజినెస్ చేసే వ్యాపారాలు లేవు.. మరి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు 6వేల కోట్లు. అకౌంట్లో అమౌంట్ చూసి అవాక్కయ్యాడు.. బిహార్‌కు చెందిన లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్‌కు డీమ్యాట్ ఖాతా ఉంది. వారం రోజుల క్రితం అతడి డీమ్యాట్ ఖాతాలోకి ఏకంగా రూ.6వేల కోట్లు వచ్చి చేరాయి. ఇంత డబ్బు ఎవరో పంపించారో ఆరా తీద్దామంటే అడ్రస్ చెప్పేవాళ్లు లేరు..
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే సుమన్ కుమార్‌కు, కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ ఖాతా ఉంది. వారం రోజుల క్రితం అందులోకి రూ.6,833.42 కోట్లు జమ అయ్యాయి. ఇటీవల ఖాతా తనిఖీ చేసుకున్నఅతడికి విషయం తెలిసింది. పొరపాటున బదిలీ అయిందని అనుకున్నాడు.. కానీ వారం రోజులు అయినా దాని గురించి ఆరా తీసిన వాళ్లు లేరు.
దీంతో సుమన్ పోలీసులను సంప్రదించాడు.. తన అకౌంట్లో ఉన్న వేల కోట్లను ముందు అర్జంటుగా ఖాళీ చేయించడని విజ్ఞప్తి చేశాడు. అయితే దీనికి సంబంధించి తమకు ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని సుర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com