Madhya Pradesh: వీకెండ్ పిక్‌నిక్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Madhya Pradesh: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో జలపాతంలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగరు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌దహా జలపాతం వారాంతపు రోజుల్లో విహార యాత్రికులతో సందడిగా మారుతుటుంది. అయితే ఆదివారం మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు జలపాతం చూసేందుకు వెళ్లారు.
జలపాతంలోని ప్లంజ్‌పూల్‌లో స్నానం చేస్తూ ఏడుగురు గల్లంతైనట్లు ఆదివారం అధికారులకు సమాచారం అందింది. మొదట, ఏడుగురు వ్యక్తులలో ఇద్దరిని గజఈతగాళ్లు రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు ఆసుపత్రిలో మరణించారని, మరొకరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
సోమవారం ఉదయం మరో మూడు మృత దేహాలను గుర్తించింది సెర్చ్ ఆపరేషన్ సిబ్బంది. మృతులను శ్వేతా సింగ్ (22), శ్రద్ధా సింగ్ (14), అభయ్ సింగ్ (22)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.
జలపాతంలో స్నానం చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తూ హెచ్చరిక బోర్డును ఉంచినప్పటికీ, పర్యాటకులు లోతైన నీటిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసు అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com