రెండో పెళ్లి చేయండి... కుటుంబసభ్యులపై అలిగి కరెంట్ స్థంబం ఎక్కిన వృద్దుడు..!

రెండో పెళ్లి చేయండి... కుటుంబసభ్యులపై అలిగి కరెంట్ స్థంబం ఎక్కిన వృద్దుడు..!
X
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ధోల్‌పుర్‌కి చెందిన సోర్బన్‌ సింగ్‌(60) భార్య నాలుగేళ్ల కిందట మరణించింది. అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తనకి రెండో పెళ్లి చేయాలనీ డిమాండ్ చేస్తూ ఓ వృద్దుడు కరెంట్ స్థంబం ఎక్కాడు.. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ధోల్‌పుర్‌కి చెందిన సోర్బన్‌ సింగ్‌(60) భార్య నాలుగేళ్ల కిందట మరణించింది. అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నప్పటికీ భార్య లేని లోటుతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు.

దీనితో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్నీ తన కుటుంబ సభ్యులకి చెబితే.. ఈ వయసులో రెండో పెళ్ళేంటని మండిపడ్డారు. రెండో పెళ్ళికి నిరాకరించారు. దీనితో సోర్బన్‌ సింగ్‌ కుటుంబసభ్యులపై అలిగి కరెంట్ స్థంబం ఎక్కేశాడు. పెళ్లికి ఒప్పుకుంటేనే దిగి వస్తానన్నాని డిమాండ్ చేశాడు.

దీనితో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు.. విద్యుత్‌శాఖ సిబ్బందికి ఫోన్‌ చేసి సమాచారం అందించడంతో.. వారు విద్యుత్ ని నిలిపివేశారు. అనంతరం అక్కడే ఉన్న ఓ యువకుడు స్తంభం ఎక్కి అతడికి సర్ది చెప్పి కిందకి తీసుకొచ్చాడు. దీనితో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story