జాతీయం

20 ఏళ్లు కలిసి ఉన్నారు.. 60 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నారు..

55 ఏళ్ల భాగస్వామి సహచర్యం ఎంతో బావుంది. అందుకే ఇప్పుడు ఆమెను కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి మూడు ముళ్లు వేసాడు.

20 ఏళ్లు కలిసి ఉన్నారు.. 60 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నారు..
X

60 ఏళ్లు నిండిన వ్యక్తి 20 ఏళ్లు ఆమెతో కలిసి ఉన్నారు. 55 ఏళ్ల భాగస్వామి సహచర్యం ఎంతో బావుంది. అందుకే ఇప్పుడు ఆమెను కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి మూడు ముళ్లు వేసాడు. ఈ జంట తమ టీనేజ్ కొడుకు తమ పెళ్లికి సాక్ష్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఉన్నవో జిల్లాలోని గంజ్ మొరాదాబాద్ లోని రసూల్పూర్ రూరి గ్రామంలో ఈ వివాహం జరిగింది.

కలిసి కాపురం చేయడానికి పెళ్లితో పనేముందనుకున్నారు. బాధల్ని, బాధ్యతల్ని సమంగా పంచుకోవాలనుకున్నారు. వెనుకా ముందు ఎవరూ లేరు. తప్పో ఒప్పో తెలియదు. తప్పటడుగు వేయలేదు. 20 సంవత్సరాల క్రితమే వీళ్లిద్దరూ కలిసి జీవించడం మొదలు పెట్టారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ (సహజీవనం)లో ఉన్నారు. ఇప్పుడు ఈ పదం గురించి కొత్తగా వింటున్నాము. కానీ ఇప్పుడు యువత ఇదే కోరుకుంటోంది.

వీరి వివాహానికి సంబంధించిన అన్ని ఖర్చులను గ్రామాధికారి, గ్రామస్తులు భరించారు. వృద్ధ దంపతులు వివాహం లేకుండా కలిసి జీవించడాన్ని గ్రామస్తులు తప్పు పట్టారు. గ్రామాధికారి వారిని వివాహానికి ఒప్పించి గ్రామస్తుల సమక్షంలో ఈ జంటకు వివాహం జరిపించారు. నిందలను నివారించేందుకు అధికారికంగా వివాహం చేసుకోవడానికి వారిద్దరూ అంగీకరించారు.

నరేన్ రైదాస్ (60), రామ్రాతి (55), 2001 నుండి కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారి కుటుంబాలలో మరెవరూ లేనందున, వారిద్దరూ వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నారు.

వారి 13 ఏళ్ల కుమారుడు అజయ్ అవమానాలు భరించకూడదని వివాహానికి అంగీకరించారు. గ్రామాధికారి, గ్రామస్తులు పెళ్లికి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చారు. పెళ్ళి వేడుకలో భాగంగా DJ, వివాహ విందు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు వారిరువురికి ఆత్మీయ స్వాగతం పలికారు.

Next Story

RELATED STORIES