అయోధ్య రామ మందిరానికి చేరుకున్న భారీ గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం కిలో మీటర్ల దూరం వరకు..

అయోధ్య రామ మందిరానికి చేరుకున్న భారీ గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం కిలో మీటర్ల దూరం వరకు..
మొత్తం 18 మంది భక్తులు రామ రథయాత్ర పేరిట తయారు చేసిన ప్రత్యేక వాహనంలో ప్రయాణించి ఈ భారీ గంటను తీసుకుని వచ్చారు.

అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు వీలుగా రామేశ్వరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కంచు గంట అయోధ్యకు చేరింది. 613 కిలోల బరువున్న ఈ కంచు గంటను తమిళనాడుకు చెందిన భక్తురాలు మండా రాజ్యలక్ష్మి తయారు చేయించి రామ మందిరానికి బహుమతిగా ఇచ్చారు. మొత్తం 18 మంది భక్తులు రామ రథయాత్ర పేరిట తయారు చేసిన ప్రత్యేక వాహనంలో ప్రయాణించి ఈ భారీ గంటను తీసుకుని వచ్చారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు సెప్టెంబరు 17న బయలుదేరిన ఈ వాహనం 21 రోజుల పాటు 11 రాష్ట్రాల మీదుగా 4,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయోధ్యకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అయోధ్య ఎంపి, ఎమ్మెల్యే, అయోధ్య మేయర్, రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గంటను మోగించినప్పుడు ఓంకార శబ్ధం వస్తుంది. ఈ శబ్ధం ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

మొత్తం 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో పాటు వినాయక ప్రతిమలతో పాటు జై శ్రీరాం అని గంటపై రాసి ఉంటుంది. ఈ ఐదు ప్రతిమ బరువు 210 కిలోలు ఉంటుందని రాజ్యలక్ష్మి అన్నారు. రాముని భక్తురాలైన రాజ్యలక్ష్మి తాను స్వామి వారికి గంట బహుమతిగా ఇవ్వడం మహద్ భాగ్యంగా భావిస్తున్నారు.

కాగా, మరెక్కడాలేని విధంగా ప్రపంచం నలుమూలల నుండి భక్తుల రామాలయానికి బహుమతులు పంపుతున్నారు. ఇప్పటివరకు ఒక బిలియన్ రూపాయల నగదు విరాళంగా వచ్చింది.

Tags

Next Story