18 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ!

18 ఏళ్ల పాటు ఓ భారతీయ మహిళ పాకిస్తాన్ జైల్లో జీవితాన్ని గడిపింది. చివరకు ఔరంగబాద్ పోలీసుల ప్రయత్నంతో పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఔరంగబాద్‌కు చెందిన హసీనా బేగం(65) 18 ఏళ్ల క్రితం తన బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్ళింది. అయితే అక్కడ తన పాస్‌పోర్టు లాహోర్‌లో మిస్ అయింది. దీనితో పాక్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని జైలుకి తరలించారు.
హసీనా బేగం కనిపించకపోవడంతో ఆమె బంధువులు 18 ఏళ్ల క్రితం ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ పోలీసు వర్గాలకు ఔరంగబాద్ పోలీసులు లేఖ రాశారు. అలా హసీనా బేగం ఆచూకీ లభించింది. ఔరంగబాద్ పోలీసుల ప్రయత్నంతో హసీనా ఇండియాకు తిరిగొచ్చింది.
జైలు నుంచి విడుదలై భారత్ కి తిరిగొచ్చిన తరవాత స్వర్గంలో ఉన్నట్టు ఉందన్నారు. అంతేకాకుండా పాక్ జైల్లో తానూ చాలా కష్టాలు ఎదురుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఔరంగబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com