లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆమెకు 55.. అతడికి 70..

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆమెకు 55.. అతడికి 70..
ఈ వయసులో తండ్రి కోరికను ఎందుకు కాదనాలి అని ఆయన మెచ్చిన నెచ్చెలితో వివాహం జరిపించారు కొడుకులు..

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా అదే జరిగింది 70 ఏళ్ల ఓంకార్ సింగ్ కి. ఆమెని చూడగానే ఏదో జన్మలో మనిద్దరం భార్యా భర్తలు కాలేక మళ్లీ ఈ జన్మలో పుట్టామేమో.. ఇంతకాలం ఎక్కడ ఉన్నావు.. నీ కోసం నా అన్వేషణ కొనసాగుతూనే ఉంది.. ఆఖరికి ఆస్పత్రిలో ఇలా కలుసుకున్నాము అని మనసులోనే భావాలు పలికించాడు 55 ఏళ్ల గుడ్డీబాయిని చూసి. ఇప్పటికే ఆలస్యం అయింది. ఇంక ఎంత మాత్రం ఈ నిరీక్షణను నేను భరించలేను అని వారి ప్రేమను ఇంట్లో కొడుకులకు చెప్పారు. వారు ముందు ఆశ్చర్యపోయినా.. ఈ వయసులో తండ్రి కోరికను ఎందుకు కాదనాలి అని ఆయన మెచ్చిన నెచ్చెలితో వివాహం జరిపించారు.

మధ్యప్రదేశ్ లోని భూరఖెడీ గ్రామంలో ఈ విచిత్ర వివాహం జరిగింది. 70 ఏళ్ల ఓంకార్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళితే అక్కడ 55 ఏళ్ల గుడ్డీబాయితో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. స్మార్ట్ ఫోన్ల యుగం.. మూడు రోజులు సంభాషించుకున్నారు.. మూడో రోజు ముహూర్తాలు పెట్టించుకుని పెళ్లి చేసుకున్నారు. ఓంకార్ సింగ్ నలుగురు కుమారులు తండ్రికి ఆయన కోరుకున్నామెతో వివాహం జరిపించారు.

Tags

Next Story