అంత్యక్రియలకు ముందు కళ్లు తెరిచిన బామ్మ..!

X
By - TV5 Digital Team |15 May 2021 3:59 PM IST
కరోనాతో చనిపోయిందని భావించిన ఓ 76 ఏళ్ల బామ్మ.. పాడపై ఉన్నప్పుడు నిద్రలేచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు.
కరోనాతో చనిపోయిందని భావించిన ఓ 76 ఏళ్ల బామ్మ.. పాడపై ఉన్నప్పుడు నిద్రలేచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి జిల్లాలోని ముధాలే గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 76 ఏళ్ల శకుంతల గైక్వాడ్‌కు ఇటీవల కరోనా సోకింది. దీనితో ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 10న కారులో బారామతిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట.. కానీ ఆమెలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆమె చనిపోయిందని అంత్యక్రియలు చేస్తుండగా ఆమె లేవడంతో అందరూ భయపడ్డారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com