హృదయవిదారక దృశ్యం.. మతిస్థిమితం లేని 8 ఏళ్ల అన్న ఒడిలో 2 ఏళ్ల తమ్ముడి శవం..

హృదయవిదారక దృశ్యం.. మతిస్థిమితం లేని 8 ఏళ్ల అన్న ఒడిలో 2 ఏళ్ల తమ్ముడి శవం..
8ఏళ్ల పిల్లవాడు, తన ఒడిలో రెండేళ్ల తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడకు జారగిలబడి కూర్చున్నాడు.. ఈ దృశ్యం స్థానికులను కలచి వేసింది.

Madhya Pradesh: 8ఏళ్ల పిల్లవాడు, తన ఒడిలో రెండేళ్ల తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడకు చారగిలబడి కూర్చున్నాడు.. ఈ దృశ్యం స్థానికులను కలచి వేసింది. తండ్రి ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తున్నాడు.. వచ్చే పోయే వాహనాలను ఆపుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు..

శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనా పట్టణంలో ఈ దృశ్యం కెమెరా కంట పడింది. 8 ఏళ్ల గుల్షన్ తన 2 ఏళ్ల సోదరుడు రాజా మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. ఆ చిన్నారుల తండ్రి పూజారామ్ జాతవ్ వారిని ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

అంబాహ్‌లోని బద్‌ఫ్రా గ్రామ నివాసి, పూజారామ్ తన 2 ఏళ్ల కుమారుడిని భోపాల్‌కు ఉత్తరాన 450 కిమీ దూరంలో ఉన్న మోరెనా జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు- స్థానిక ఆసుపత్రి వైద్యులు ఇక్కడి ఆస్పత్రికి రిఫర్ చేయడంతో కొడుకును తీసుకొని వచ్చాడు.

2 ఏళ్ల ఆ చిన్నారి రక్తహీనత, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నాడు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే మరణించాడు. అయితే వారిని తీసుకొచ్చిన అంబులెన్స్ తిరిగి వెళ్లిపోయింది. +తన గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆర్థిక స్తోమత లేని పూజారాం ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు. కానీ ఆసుపత్రి చేతిలో వాహనం లేదని, బయట ఉన్న ఒకదానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు ఆస్పత్రి సిబ్బంది.

ఆసుపత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ ఆపరేటర్ రూ.1,500 అడిగాడు. నలుగురు పిల్లలున్న ఆ ఒంటరి తండ్రికి అది భరించలేని భారం. నిస్సహాయుడైన పూజారామ్ తన కొడుకు రాజా, గుల్షన్ మృతదేహంతో ఆసుపత్రి నుండి బయలుదేరాడు. అతనికి ఏ వాహనం దొరకలేదు.

ఆ సమయంలోనే అతను మతిస్థిమితం లేని కొడుకు గుల్షన్‌ను, మరిణించిన కొడుకు శవాన్ని అక్కడే మోరీనా నెహ్రూ పార్క్ ముందు విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఇవేవీ తెలియని గుల్షన్ చనిపోయిన తన సోదరుడి తలను తన ఒడిలో పెట్టుకుని అక్కడే కూర్చున్నాడు. తన తండ్రి తిరిగి వచ్చి తమను తీసుకువెడతాడని ఎదురుచూస్తున్నాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ మృతదేహాన్ని ఎత్తుకుని, గుల్షన్‌ను తిరిగి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదని స్థానికులు కంట తడి పెట్టడం కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story