Bihar : 80 అడుగుల వంతెనను ఎత్తుకెళ్లిన దొంగలు..!

Bihar :  80 అడుగుల వంతెనను ఎత్తుకెళ్లిన దొంగలు..!
Bihar : బిహర్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.. గత నెలలో రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు..

Bihar : బిహర్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.. గత నెలలో రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా మరో వంతెనను మాయం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది.

బంకా జిల్లా చందన్ బ్లాక్‌‌లో 2004లో నిర్మించిన 80 అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ను గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించి ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌ నుంచి జార్ఖండ్‌లోని దేవఘర్‌కు వెళ్లే కన్వారియాల తరలింపునకు వీలుగా రూ.45 లక్షల వ్యయంతో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో వంతెనను నిర్మించారు.

అయితే ఇది తుప్పుపట్టడంతో దీనిపైనుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దీనినే అదునుగా తీసుకున్న దొంగలు దాదాపుగా 70% వంతెనను మాయం చేశారు.

Tags

Next Story