Home
 / 
జాతీయం / ప్రయాణికులకు...

ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తుంది

ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు
X

ప్రయాణికుల మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 12 నుంచి మరో 80 కొత్త ప్యాసింజర్ రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రిజర్వేషన్లు 10 నుంచి ప్రారంభిస్తామని అన్నారు. ఏ రైళ్లకు వెయిటింగ్ ఎక్కువగా ఉందో రైల్వేశాఖ పరిశీలిస్తుందని తెలిపారు. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కొత్తగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరీక్షలు లేదా ఇతర సందర్భాల్లో రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్ మేరకు మరిన్ని రైళ్లను నడిపిస్తామని యాదవ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్రం రైళ్లను రద్దు చేసి.. ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే రైళ్లను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story