Chennai: అమ్మకు 90.. కూతురుకి 72.. ఇద్దరూ కలిసి వ్యాపారం..

Chennai: అమ్మకు 90.. కూతురుకి 72.. ఇద్దరూ కలిసి వ్యాపారం..
Chennai: ఈ వయసులో ఏం చేద్దామనుకుంటున్నావు.. హాయిగా ఇంట్లో కృష్ణా, రామ అనుకుంటూ కూర్చోక.. వయసు మీదపడిన వాళ్లని చూస్తే ఇంట్లో అందరికీ చులకనే.

Chennai: ఈ వయసులో ఏం చేద్దామనుకుంటున్నావు.. హాయిగా ఇంట్లో కృష్ణా, రామ అనుకుంటూ కూర్చోక.. వయసు మీదపడిన వాళ్లని చూస్తే ఇంట్లో అందరికీ చులకనే. కానీ 90 ఏళ్ల వయసున్న ఆమెకు ఏదో చేయాలన్న తపన.. దానికి 72 ఏళ్ల వయసున్న కూతురు కూడా తోడైంది. ఇద్దరూ కలిసి ఓ కొత్త బిజినెస్‌కు శ్రీకారం చుట్టారు. తమకు వచ్చిందే చేయాలనుకున్నారు.

మీకు ప్రతిభ, నైపుణ్యం ఉన్నప్పుడు, మీ కలలను సాధించకుండా ఏదీ మిమ్మల్ని నిరోధించ లేదు. సమాజంలోని మూస పద్ధతులకు స్వస్థి చెప్పి, వయస్సు పరిమితులను ధిక్కరించి చెన్నైకి చెందిన ఈ ఇద్దరు మహిళా మూర్తులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మీ కలలు, మీ అభిరుచులు కొనసాగించే విషయానికి వస్తే, వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సమాజంలోని నియమాలు, నిబంధనలకు కట్టుబడి మీ నైపుణ్యాలను వృధా చేయకూడదు. ఈ వాస్తవాన్ని చెన్నైకి చెందిన ఈ ఇద్దరు మహిళలు నిరూపించారు. అమ్మమ్మలు అయ్యాక వ్యాపారవేత్తలుగా మారారు. వృద్ధాప్య జాడలు వారి ఆలోచనల్లో కానీ, వారి వ్యాపారంలో కానీ కనపడనివ్వకుండా చూసుకుంటున్నారు.

చెన్నైకి చెందిన లక్ష్మి 86 ఏళ్ల వయసున్నప్పుడు, 65 ఏళ్ల వయసులో ఉన్న తన కుమార్తె కస్తూరి శివరామన్‌తో కలిసి చెన్నైలోని తిండివనంలోని రెట్టనై గ్రామంలో వక్సన అనే పేరుతో ఫామ్‌ స్టేను స్థాపించారు. అయితే, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం అంత తేలికైన పని కాదు. ఇంటి వద్ద పొడులు, మసాలాలను తయారు చేయడం, ప్యాక్ చేసి డోర్ టు డోర్ విక్రయించడం ప్రారంభించింది. పెరుగుతున్న వయస్సు కారణంగా దానిని దీర్ఘకాలం కొనసాగించలేమని ఆమె గ్రహించింది.

దాంతో మొబైల్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఆమెకు ఫామ్ స్టే ఆలోచన వచ్చింది. కుమార్తె కస్తూరితో కలిసి ఆతిథ్య కేంద్రాన్ని స్థాపించారు. వీటికి మార్కెటింగ్‌కి సంబంధించిన విషయాలను కస్తూరి పిల్లలు, మనవళ్లు మనవరాళ్లు చూసుకుంటున్నారు. అతిధులు ఇష్టపడే పాత కాలం వంటకాలు తయారు చేయడం వీరి ప్రత్యేకత.

తన కుమార్తెతో కలిసి పనిచేయడం గురించి లక్ష్మి మాట్లాడుతూ , "ఆమె నా పక్కన ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వారిలో ఇద్దరు చనిపోయారు. కస్తూరి ఒక్కరే. కాబట్టి ఇప్పుడు నేను ఆమెతో సమయం గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది.

ఇప్పుడు వీరు ఇద్దరూ ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండటమే కాకుండా స్థానికులకు వారి హోమ్‌స్టే సమయంలో జీవనోపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story