అవ్వా.. నీకు వందనం : బిక్షాటన చేసి అన్నదానానికి సాయం!

దేవుడి పేరు చెప్పుకొని పొట్ట నింపుకునే వాళ్ళు అయితే సమాజంలో చాలానే మంది ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా ఉంది ఈ వృద్దురాలు.. కర్ణాటకకు చెందిన ఈ వృద్దురాలు పేరు అశ్వత్థమ్మ (80) .. ఈమె భిక్షాటన చేసి జీవిస్తోంది. అయితే ఇలా వచ్చిన డబ్బును బ్యాంకులో వేసి పలు దేవాలయాల్లో అన్నదానాలకు రూ.లక్షల్లో చందాలు ఇస్తోంది. అయ్యప్ప భక్తురాలైన ఈమె శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్నదానానికి రూ.1లక్షల సహా పలు ఆలయాలకు కలిపి రూ.5లక్షల వరకు దానం చేసింది. డబ్బును దాచుకోకుండా ఇలా పదిమంది కడుపు నింపేందుకు సాయం చేస్తుండటంపై ప్రశంసలు వస్తున్నాయి.
ఏ దేవాలయానికి ఎంత దానం అంటే..
ఉడుపి గురునరసింహ దేవాలయం - రూ.1 లక్ష.
తన్నూరు కంచుగోడు దేవాలయం - రూ.1.5 లక్షలు.
శబరిమల - రూ.1 లక్ష
తాజాగా పొలాలి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి కొంత మొత్తాన్ని సమర్పించింది. ఈ డబ్బును అన్నదానం వంటి కార్యక్రమాల కోసం ఉపయోగించాలని ఆలయ యాజమాన్యాలకు తెలిపింది. ఈ సందర్భంగా అశ్వత్థమ్మ మాట్లాడుతూ.. తానూ అయ్యప్ప భక్తురాలినని చెప్పుకొచ్చింది. భిక్షాటన చేయగా వచ్చిన కొంత డబ్బును బ్యాంకులో వేసుకొని మిగిలిన డబ్బును ఆలయాలకు ఇస్తానని పేర్కొంది.. ప్రతి ఏటా అన్నదానం కార్యక్రమాల కోసం కొంత డబ్బు దానం చేస్తానని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com