Guru Mayadhar Raut : 90ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతను రోడ్డు పైన నిలబెట్టారు..!

Guru Mayadhar Raut : 90ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతను రోడ్డు పైన నిలబెట్టారు..!
Guru Mayadhar Raut : ప్రముఖ ఒడిస్సీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గురు మయధర్‌ రౌత్‌( 90)ను ప్రభుత్వ వసతి గృహం నుంచి బయటకు పంపించారు అధికారులు

Guru Mayadhar Raut : ప్రముఖ ఒడిస్సీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గురు మయధర్‌ రౌత్‌( 90)ను ప్రభుత్వ వసతి గృహం నుంచి బయటకు పంపించారు అధికారులు.. హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేయించి ఇంట్లోని సామాన్లను బయటపెట్టి అవమానకరంగా ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురు మయధర్‌ రౌత్‌ కుమార్తె మధుమితా రౌత్‌ దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి కళాకారులంటే గౌరవం లేదని ఆమె అసహనం వ్యక్య్తం చేశారు. ఇంతకీ ఏం జరిగింది అంటే.


గత కొన్నేళ్లుగా దిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. అయితే 2014లో వీటిని రద్దు చేసింది. దీనిపైన కేంద్రం నోటిసులు కూడా జారీ చేసింది. కళాకారులంతా కోర్టుకు వెళ్ళినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో చాలా మంది తమ బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.. అయితే ఎలాంటి ఆస్తులు లేని మయధర్‌ రౌత్‌ మాత్రం అక్కడే ఉండిపోయారు. దీనితో అధికారులే స్వయంగా వచ్చి ఖాళీ చేయించారు. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై కన్పించాయి.


ఈ ఘటన పైన మయధర్‌ కుమార్తె మధుమితా రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చట్టపరంగా ఇల్లు ఖాళీ చేయించడం సరైనదే కానీ అధికారులు ప్రవర్తించిన తీరు బాలేదని ఆమె మండిపడ్డారు.తన నాట్యంతో ఎన్నో సేవలందించిన ఆయనకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని ఆమె అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story