Chhattisgarh Railway Station Blast: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు.. ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు..

Chattisgarh railway station blast: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఆరుగురు CRPF సిబ్బంది గాయపడ్డారు. డిటోనేటర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం ఆరున్నరకు ప్లాట్‌ఫామ్ 2పై ఈ ఘటన జరిగింది. జార్సుగూడ నుంచి జమ్ముతావీకి వెళ్తున్న ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ జారి పడడం వల్లే ఈ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడ్డవారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు..
ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు
ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ జారి పడడం వల్లే పేలుడు
జార్సుగూడ నుంచి జమ్ముతావీకి వెళ్తున్న జవాన్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com