Jammu Kashmir : వైష్ణో దేవీ యాత్రకు వెళ్లే బస్సులో మంటలు.. నలుగురు మృతి

Jammu Kashmir :  వైష్ణో దేవీ యాత్రకు వెళ్లే బస్సులో మంటలు.. నలుగురు మృతి
X
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని కట్రాలో దారుణం జరిగింది. వైష్ణో దేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని కట్రాలో దారుణం జరిగింది. వైష్ణో దేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 22 మందికి తీవ్రగాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత భారీ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కట్రాకు 1.5 కిమీ దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంజన్‌లో మొదలైన మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. బస్సులో పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతుండటంతో ఉగ్రదాడి జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు.

"కట్రాలో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. క్షతగాత్రులకు సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని అదేశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.


Tags

Next Story