రెప్పపాటు కాలం.. వేగంగా వస్తున్న రైలు కింద..

రెప్పపాటు కాలం.. వేగంగా వస్తున్న రైలు కింద..
మహరాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి బతికాడేమో.. లేకపోతే రైలు పట్టాల మీద చెప్పు పడిపోయిందని వెనక్కి వెళ్లి అక్కడే ఉండకపోగా పోలీసు మాటనీ ఖాతరు చేయక వచ్చాడు.. ఒక్క క్షణంలో చావు నుంచి తప్పించుకున్నాడు.

మహరాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్ మీదకు రైలు పట్టాల మీదుగా దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడి చెప్పు పట్టాలపై పడింది. అదే సమయంలో స్టేషన్‌లోకి రైలు వస్తున్నా పట్టించుకోకుండా చెప్పు కోసం మళ్లీ పట్టాల మీదకు వెళ్లాడు.

అతడిని గమనించిన ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి పట్టాలపై పడుకోమని సైగ చేశాడు. కానీ సదరు వ్యక్తి ఖాతరు చేయకుండా ట్రైన్ వచ్చే లోపు దాటేయొచ్చనుకున్నాడు. ఇంతలో ట్రైన్ రానే వచ్చింది. పోలీస్ ఒక్క ఉదుటన అతడిని పైకి లాగి నెత్తి మీద ఒక్కటిచ్చుకున్నాడు.

ఎంత మండి ఉంటే అలా చేసి ఉంటాడో.. లేకపోతే అన్యాయంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడని ప్రయాణీకులు మాట్లాడుకుంటున్నారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడినందుకు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story