అయోధ్యలో అయిదులక్షల దీపాలతో..

అయోధ్యలో అయిదులక్షల దీపాలతో..
X
శుక్రవారం పది గంటలకు రాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న పటాలతో

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో భక్తులు భారీ ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. 5 లక్షల 51 వేల ప్రమిదలతో అయోధ్యను దీపకాంతులతో నింపాలని నిర్ణయించారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి అయోధ్యకు చేరుకున్నారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరు కావాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తులు చేసినా భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకున్నారు.

శుక్రవారం పది గంటలకు రాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న పటాలతో 11 రథాలను ట్రస్ట్ సిద్ధం చేసింది. ఈ ప్రదర్శన సాకేత్ మహా విద్యాలయం నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం యోగి అక్కడికి చేరుకుంటారు. రామ్ లల్లా దర్శనం చేసుకుని దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.

Tags

Next Story