Goa: కరోనాకి రెడ్ కార్పెట్.. అక్కడి రోడ్ల మీద జనం కుప్పలు తెప్పలు..

Goa: కరోనాకి రెడ్ కార్పెట్.. అక్కడి రోడ్ల మీద జనం కుప్పలు తెప్పలు..
Goa: సామాజిక దూరం, మాస్కుల ఊసేలేదు. మద్యం మత్తులో ఊగి తేలారు గోవా పర్యాటకులు.

Goa: న్యూయర్ వేడుకలను గోవాలో చేసుకోవాలని చాలా మంది ముచ్చటపడుతుంటారు.. ఒమిక్రాన్ వార్తలు భయపెడుతున్నా సంబరాల్లో మునిగితేలేందుకు పర్యాటకులు గోవాకు పోటెత్తారు. ఆదివారంనాటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 388 మందికి పాజిటివ్ వచ్చిందని గోవా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర గోవాలోని బాగా బీచ్ సమీపంలోని రోడ్డుపై వందలాది మంది ప్రజలు నడుచుకుంటే వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్‌ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది మంది పర్యాటకులు గోవాలోని బీచ్‌లు, పబ్‌లు మరియు నైట్‌క్లబ్‌ల వద్ద న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకునేందుకు గుమిగూడారు. దాంతో కేసుల సంఖ్య ఎక్కువైంది. సామాజిక దూరం, మాస్కుల ఊసేలేదు. మద్యం మత్తులో ఊగి తేలారు గోవా పర్యాటకులు.

Tags

Next Story