యూఏఈలో రూ. 20 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు

X
By - shanmukha |5 Sept 2020 8:26 AM IST
యూఏఈలో ఓ భారతీయుడికి లాటరీ ద్వారా భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు.
యూఏఈలో ఓ భారతీయుడికి లాటరీ ద్వారా భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీకి మేనేజర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ పది మిలియన్ దిర్హామ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు 19.90 కోట్లకు సమానం. ఈ విషయాన్ని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. ఆగస్టు12న లాటరీ టికెట్ కొన్న గురుప్రీత్ సింగ్.. తాజాగా జాక్‌పాట్ గెలుచుకున్నట్టు లాటరీ సంస్థ ప్రకటించింది. అయితే, గురుప్రీత్ సింగ్ కు లాటరీ టికెట్ కొనడం ఓ అలవాటుగా మారిపోయింది. గత రెండేళ్ల నుంచి వరుసగా లాటరీ టికెట్ కొంటున్నాడు. అయితే, ఎట్టకేలకు ఆయనను అదృష్టం వరించింది. దీంతో ఆయన సంతోషంలో మునిగితేలుతున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com