భార్యను హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టిన భర్త!

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే.. భార్యను దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో నిర్థారించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధిర మండలానికి చెందిన నాగశేషు రెడ్డితో ఎర్రమల్ల నవ్యరెడ్డికి వివాహం రెండు నెలల క్రితం జరిగింది.నాగశేషురెడ్డి బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తుండగా, నవ్యరెడ్డి సత్తుపల్లిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది.
అయితే నవ్యరెడ్డి కనబడటం లేదని రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసు పెట్టింది కూడ భర్తే కావడం. కేసులో భాగంగా పోలీసులు విచారణ చేస్తుండగా శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్యరెడ్డి మృతదేహం పోలీసులకి దొరికింది.
ఆమె భర్త నాగశేషురెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్యరెడ్డిని భర్త నాగశేషురెడ్డి బైక్ పై తీసుకువెళ్తున్న సీసీటివి ఫుటేజ్‌ని పోలీసులు సేకరించారు. నిందితుడితో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com