Earthquake: ఈశాన్య ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు.. నేలమట్టం అయిన ఇళ్లు..

Earthquake: ఉత్తర, ఈశాన్య భారతంలో భూమి కంపించింది. న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు రాగా.. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు.ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని సమాచారం..
మరోవైపు నేపాల్‌లో కూడా 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఆరుగురు మరణించినట్లు నేపాల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేపాల్‌లోని దోటీ జిల్లాలో భూకంపంతో ఇల్లు కూలిపోయాయి.. ఈ భూకంపం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు ఈశాన్యంగా 158 కిలోమీటర్లలలో కేంద్రీకృతమై ఉంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సీస్మాలజీ సెంటర్ తెలిపింది. నేపాల్‌లో 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది.
ఇక ఢిల్లీతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, మణిపూర్‌లోనూ లోనూ భూకంపం సంభవించింది. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. స్థానిక ప్రజలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చైనాలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com