విగ్గు మొగుడొద్దు.. కట్నం వాపస్ కావాలని భార్య డిమాండ్!

పెళ్లి చూపుల్లో తన భర్త అందమైన క్రాఫ్‌తో ఉన్నాడని పెళ్లి చేసుకుంది. పెళ్లినా ఐదేళ్ళ తర్వాత అది క్రాఫ్ కాదని విగ్గు అని తెలుసుకొని షాక్ అయింది. దీనితో విగ్గున్న మొగుడొద్దని, పెళ్ళికి తీసుకున్న కట్నం పైసలను తిరిగి ఇచ్చేయలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. ఈ విచిత్రమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు 27 ఏళ్ల యువతితో 2015లో పెళ్లైంది. పెళ్లి చూపుల సమయంలో రాజశేఖర్ తనది బట్టతల కావడంతో విగ్ ధరించి వెళ్ళాడు.. సహజ వెంట్రుకలతో తయారుచేసిన విగ్ కావడంతో వధువుతో పాటుగా ఎవరు కూడా అంతగా గమనించలేకపోయారు. అయితే ఇటీవల అది క్రాఫ్ కాదని, విగ్గని తెలుసుకొని షాక్ అయింది.
దీనితో దంపతుల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు మొదలయ్యాయి. పెళ్ళిలో కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి దాడి చేశారు.
దీనితో తనని విగ్ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ భాదిత మహిళా చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com