Abhinandan Varthaman : అభినందన్‌కు ప్రమోషన్..గ్రూప్ కెప్టెన్‌గా..!

Abhinandan Varthaman : 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో వైమానిక పోరాటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కి అరుదైన గౌరవం లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో కర్నల్ ర్యాంక్‌తో సమానం అన్నమాట.. కాగా ఫిబ్రవరి 14న కాశ్మీర్‌లోని పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఫిబ్రవరి 27న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలో పాక్ బలగాలకు చిక్కారు. అయినప్పటికీ ఎక్కడ కూడా బయపడకుండా, దేశరహస్యాలను బయటపెట్టలేదు.. అభినందన్‌ను సురక్షితంగా తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయడంతో పాక్ ఏం చేయలేక అభినందన్ ను భారత్ కి అప్పగించింది. ఇక 2019లో భారత ప్రభుత్వం అభినందన్ ని వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com