Accident : డెహ్రాడూన్ లో బస్సు ప్రమాదం

Accident : డెహ్రాడూన్ లో బస్సు ప్రమాదం

ముస్సోరీ-డెహ్రాడూన్ లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు లోయలో బోల్తాపడింది. ముస్సోరీ-డెహ్రాడూన్ మార్గంలో రోడ్డు మార్గంలో వెళ్లే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ముస్సోరీ డెహ్రాడూన్ ప్రధాన రహదారిపై షెర్గాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఐటీబీపీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కాలువలో నుంచి బయటకు తీసి లాందూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డెహ్రాడూన్ నుంచి బస్సు వస్తుండగా అదుపు తప్పి వాగులో పడిపోయింది. సమాచారం అందుకున్న ముస్సోరీ, ITBP, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story