ఈరోజే పెళ్లి.. అంతలోనే విషాదం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవర గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు.

ఓ పక్క పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో మృత్యుఘంటికలు వినిపించాయి. సరదా, సంబరాల్లో మునిపోవాల్సిన ఇంట్లో కుటుంబసభ్యుల ఏడుపులు, బంధువుల కన్నీళ్లతో పెళ్లి పందిరి తడిచి ముద్దైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవర గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రాజు అనే యువకుడి పెళ్లి కోసం ఐదుగురు వ్యక్తులు పంచాయితీ ట్యాంకరుతో నీటిని తీసుకురావడానికి వెళ్లారు.
సున్నిపాయ వాగు నుంచి నీటిని తీసుకొని వస్తుండగా రహదారి మలుపు వద్ద అదుపుతప్పి ట్రాక్టరు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండలంలోని చిన్న దేవరకు చెందిన తుకారాం(26), బిచ్కుండకు చెందని సాయిలు (25), మద్నూరుకు చెందిన శకర్ (25) మృతి చెందారు. మారుతి, సంగు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ సాజిద్ అలీ పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
RELATED STORIES
వైట్ డ్రెస్లో వయ్యారాలు ఒలకబోస్తున్న కియారా .. లేటెస్ట్ ఫోటోస్
3 Aug 2021 2:49 AM GMT301 జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు
9 May 2021 9:30 AM GMTTest story
22 Aug 2020 12:31 PM GMTమారుమూల పల్లె నుంచి యూట్యూబ్ హీరోగా.. 20 ఏళ్ల కుర్రాడి కథ
14 May 2020 7:38 PM GMTజనసేన లాంగ్ మార్చ్ అప్ డేట్స్..
3 Nov 2019 5:22 AM GMTఆపిల్ వాచ్ పోలికతో షియోమి కొత్త స్మార్ట్ వాచ్
2 Nov 2019 12:13 PM GMT