యాక్ట్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ సేవలు ఉచితంగా..

ఎక్కడికి వెళ్లినా మీ వెంటే మేం ఉంటాం అంటోంది ఇంటర్ నెట్ యూజర్ సంస్థ యాక్ట్. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లను ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల వద్ద 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వినియోగించుకోవచ్చు.
వరంగల్‌లోనూ ఉచిత హై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాక్ట్ సంస్థ తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో మొత్తం 18 ఉచిత హై-ఫై సెంటర్లు ఏర్పాటు చేసింది.
యాక్ట్ ఫ్రీ హై-ఫైని కనెక్ట్ చేసుకునే విధానం..
ఫ్రీ ఇంటర్నెట్ పొందాలంటే హైఫై జోన్ పరిధిలోకి వెళ్లాలి.
హైఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి.
వెంటనే యూజర్ లాగిన్ పాప్‌అప్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నెంబరుకి ఓటీటీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
సాధారణ వినియోగదారులైతే రూ.25, రూ.50తో టాప్‌ఆప్ పొందొచ్చు. యాక్ట్ వినియోగదారులైతే ఇంటి దగ్గర ప్లాన్‌నే ఇక్కడ కూడా కంటిన్యూ చేయవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com