Praveen Kumar Sobti: మహాభారత్‌లోని 'భీమ్' పాత్రధారి ఇక లేరు..

Praveen Kumar Sobti: మహాభారతంలో భీమ్ పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. బిఆర్ చోప్రా యొక్క మహాభారతంలో భీమ్ పాత్రను పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి గుండెపోటుతో 75 సంవత్సరాల వయస్సులో మరణించారు.
ప్రవీణ్ కుమార్తె నికునిక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తండ్రి మరణించాడని తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. ఢిల్లీలోని ఇంట్లోనే చనిపోయారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రవీణ్ కుమార్ సోబ్తి గొప్ప అథ్లెట్. డిస్కస్ త్రోయర్, సినిమా నటుడు, రాజకీయ నాయకుడు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన మాజీ సైనికుడు. 20 ఏళ్ల వయస్సులో సైన్యంలో చేరాడు. తన అథ్లెటిక్ నైపుణ్యాల ద్వారా అధికారుల దృష్టిని ఆకర్షించాడు " డిస్కస్ త్రో " లో వివిధ అథ్లెటిక్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
అథ్లెట్‌గా ఆసియా క్రీడలలో నాలుగు పతకాలు సాధించాడు, ఇందులో రెండు బంగారు పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.. నటుడిగానూ నిరూపించుకున్నారు ప్రవీణ్. 50 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో నటించాడు.
అన్నిటికంటే ఎక్కువ పేరు తెచ్చింది, నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది 1988లో ప్రారంభమైన BR చోప్రా యొక్క టెలివిజన్ ధారావాహిక మహాభారత్ ద్వారా. ఈ టెలివిజన్ సీరియల్‌లో " భీమ్ " పాత్రను పోషించాడు. ఈ పాత్ర ద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాజకీయ నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశాడు. కానీ ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com