ఈ అలవాటు మంచిది కాదు.. మీరు మాత్రం అలా చేయకండి: రష్మిక మందన

ఈ అలవాటు మంచిది కాదు.. మీరు మాత్రం అలా చేయకండి: రష్మిక మందన
ఈ మధ్య యాపిల్ సిడర్ వెనిగర్ కూడా యాడ్ చేయమని డైటీషియన్ చెప్పడంతో అది కూడా కలిపి తాగుతున్నాను.

ఆహారంతో పాటు ఆలోచనలూ ఆరోగ్యంగా ఉంటే అందం మీ సొంతమవుతోంది అని అంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన.. ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోంది. అందాన్ని కాపాడుకుంటే మరిన్ని సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చనే సూత్రాన్ని తూచ తప్పక పాటిస్తోంది రష్మిక. అందుకోసం డైటీషియన్ ఎలా చెబితే అలా చేస్తానంటోంది.

ఉదయం లేచిన వెంటనే లీటర్ నీళ్లు తాగుతా.. ఈ మధ్య యాపిల్ సిడర్ వెనగర్ కూడా యాడ్ చేయమని డైటీషియన్ చెప్పడంతో అది కూడా కలిపి తాగుతున్నాను. అవకాడో టోస్ట్ అంటే చాలా ఇష్టం.. కానీ డైటీషియన్ తినొద్దని చెప్పింది అందుకే మానేశా. తను ఏది చెబితే అదే తింటా. రోజూ ఒక బౌల్ నిండుగా రకరకాల పండ్ల ముక్కలు తీసుకుంటా.. అదే నా బ్రేక్‌ఫాస్ట్. ఇక లంచ్ విషయానికి వస్తే అన్నం ఎక్కువ తినను.. కూరలన్నీ కలిపి ఓ కప్పు, డిన్నర్ చాలా లైట్‌గా తీసుకుంటాను. నాజూగ్గా కనిపించాలని నాన్‌వెజ్ మానేశా. కొన్ని కూరగాయలు కూడా నాకు పడవు. అవి తింటే అలెర్జీ వస్తుంది.

ఐస్ క్రీములు, కేకులు, చాకొలెట్ అంటే చాలా ఇష్టం. కానీ వాటిని కూడా పక్కన పెట్టా. అప్పుడప్పుడూ డైటీషియన్ అనుమతితో తింటా. రాత్రి పూట సరైన సమయానికి ఆహారం తీసుకోను. నచ్చినప్పుడు తింటా. ఇది అంత మంచి అలవాటు కాదు.. మీరు మాత్రం అలా చేయకండి.. అని చెబుతూ అందంగా ఉండాలంటే ఆరోగ్య కరమైన ఆహారం‌తో పాటు పాజిటివ్ ఆలోచనలు కూడా ఉండాలని.. మనసు అందంగా ఉంటే మనిషి కూడా అందంగా ఉంటారు అని అంటోంది ఈ సొట్ట బుగ్గల చిన్నది.

Tags

Next Story