Chennai: కొంప ముంచిన హోమ్ టూర్ వీడియో.. హాస్య నటుడికి రూ.2.5 లక్షల జరిమానా

Chennai: రెండు చేతులా సంపాదించాలనుకున్నాడు కానీ అనవసరంగా రెండున్నర లక్షలు పోగొట్టుకుంటానని కలలో కూడా అనుకోలేదు. యూట్యూబ్ వచ్చాక ఏది పడితే అది పోస్ట్ చేయడం లైకులు, షేర్లు, సబ్‌స్క్రైబ్‌లతో వ్యూయర్ షిప్ పెంచుకోవడం.. దాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవడం. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కూడా అత్యుత్సాహంతో హోం టూర్ వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. వ్యూయర్ షిప్ బాగానే వచ్చింది. కానీ అందులో చూపించిన రెండు చిలుకలు అటవీ అధికారుల కంట పడ్డాయి. అనుమతి లేకుండా చిలుకల్ని ఇంట్లో బంధిస్తావా.. అని ధూమ్ ధామ్ అంటూ అతడిపై విరుచుకుపడ్డారు.
రెండు ఆకుపచ్చ అలెగ్జాండ్రిన్ చిలుకలను పెంచుకుంటున్నారు శంకర్.. హూటాహుటిన అధికారులు శంకర్ ఇంటికి వెళ్లి బోనులో ఉన్న రెండు చిలుకలను తెచ్చి గిండి చిల్డ్రన్స్ పార్కుకు అప్పగించారు. తదుపరి విచారణ జరుపుతున్నామని అటవీశాఖ తెలియజేసింది. సరైన అనుమతి లేకుండా ఇంట్లో విదేశీ పక్షులను పెంచుకున్నందుకు నటుడికి అటవీ శాఖ రూ.2.5 లక్షల జరిమానా విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com