పెళ్లిపీటలెక్కనున్న విద్యుల్లేఖ

పెళ్లిపీటలెక్కనున్న విద్యుల్లేఖ
నటుడు మోహన్ రామన్ కుమార్తె, విద్యూ ఇప్పటివరకు పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు, గత కొన్ని సంవత్సరాలుగా

నటుడు మోహన్ రామన్ కుమార్తె, విద్యూ ఇప్పటివరకు పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు, గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. తమిళనటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న విద్యుల్లేఖ రామన్ పెళ్లి పీటలు ఎక్కనుంది. రాజు గారి గది, మహర్షి, వెంకి మామ తదితర చిత్రాల్లో ఆమె నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. బొద్దుగా ఉన్నా చలాకీగా ఉండే విద్యుల్లేఖ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. లాక్డౌన్ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న విద్యు ఫిట్ నెస్ పై దృష్టి సారించి స్లిమ్ గా తయారైంది.

గత కొంత కాలంగా ఫిట్‌నెస్‌ నిపుణుడు, న్యూట్రీషియన్ అయిన సంజయ్ తో ఆమె ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ పెద్దలు అంగీకారంతో పెళ్లికి దారితీసింది. ఆగస్టు 26న రోకా వేడుకను నిర్వహించారు. కరోనా వేళ అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరైన ఈ వేడుక ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిందని విద్యు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుని వేడుక నిర్వహించామని.. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని విద్యు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ కంగ్రాట్స్ అక్కా అని కామెంట్ చేయగా, రాశీఖన్నా హే క్యూటీస్ అని పేర్కొంది. సాయి తేజ్, నిధి అగర్వాల్, పాయల్ రాజ్ పుత్, తేజస్వీ, ధన్య బాలకృష్ణన్, రుహానీ శర్మ విద్యులేఖకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story