నా మనవరాలు హీరోయిన్ 'టబు'లా ఉంటుంది.. సినిమాల్లోకి వస్తానంటే: అన్నపూర్ణ

నా మనవరాలు హీరోయిన్ టబులా ఉంటుంది.. సినిమాల్లోకి వస్తానంటే: అన్నపూర్ణ
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలనూ పంచుకున్నారు.

దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించిన అన్నపూర్ణమ్మ అందరి హీరోలకు అమ్మగా చేశారు.. ప్రస్తుతం యువ నటులకు అమ్మమ్మగా కూడా చేస్తున్నారు. ఏ పాత్రలో చేసినా అవలీలగా ఆ పాత్రలో ఒదిగి పోతారు. సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలనూ పంచుకున్నారు. మద్రాస్ కోడంబాకంలో అయిదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే విలాసినీ రెడ్డి అనే ఓ డాక్టర్‌ ఉండేవారు. ఆమె దగ్గరే సినిమా వాళ్లందరూ పురుడు పోయించుకున్నారు.

డెలివరీ ఖర్చు మొత్తం రూ.300లోపు అయిపోయేది. అలా తన కూతుర్ని కూడా వైద్యురాలిని చేసి బెజవాడలో ఆస్సత్రి పెట్టించాలనుకున్నారు. ఓ ఆడపిల్లను పెంచుకుని పెద్ద చేసి డాక్టర్‌ని చేయాలని కలలు కన్నారు. కానీ అన్నపూర్ణమ్మ పెంచుకున్న కూతురుకి చదువు అబ్బలేదు. కానీ చాలా అందంగా ఉండేది. దాంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేశాం. ఓ కూతురు కూడా పుట్టింది. అయితే ఆ బిడ్డకు మాటలు రాలేదు. ఆ బాధతోనో ఏమో ఆత్మహత్య చేసుకుంది. పాపకు ఇప్పుడు మాటలొస్తున్నాయి. హీరోయిన్ టబులా ఉంటుంది. సినిమాల్లోకి వస్తుందేమో.. నేను బతికుంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని అన్నపూర్ణమ్మ చెప్పారు.

Tags

Next Story